ముదా కరాత్త మోదకం
సదా విముక్తి సాధకం
కళా ధరా అవతంసకం విలాసిలోక రక్షకం
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం
ముదా= ఆనందమును; కరాత్త= చేతిలో;
మోదకం= మోదకము వలే పట్టుకున్నవాడు; సదా= ఎల్లపుడూ; విముక్తి= మోక్షమునకు; సాధకం= సాధనమైనవాడు;
కళా= చంద్రకళను; అవతంసకం= నగవలె; ధరా= ధరించనవాడు; విలాసిలోక= విలాసముగా జగములను; రక్షకం= రక్షించుచున్నవాడు;
అనాయకైక= ఏ దిక్కు లేని వారికి; నాయకం= దిక్కైనవాడు;
వినాశితేభ= వినాశనమైనవాడు
; దైత్యకం= రాక్షసులకు;
నత= నమస్కరించిన
వారి; అశుభ= ఆపదలను; ఆశు= క్షణాల్లో; నాశకం= కూలద్రోయువాడు; నమామి=
నమస్కరించెదను; తం= అటువంటి వినాయకం=
ఏ
నాయకుడు లేనివాడికి;
నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం
నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరం
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం
నత + ఇతరాతి= నమస్కరించని వారికి; భీకరం= భయంకరుడు;
నవ= క్రొత్తగా; ఉదితా= ఉదయించే; అర్క= సూర్య; భాస్వరం= కాంతి వలే ఎర్రని తేజస్సు కలవాడు
సుర+అరి= దేవతలు, రాక్షసులచే; నమః= నమస్కరింపబడే వాడు; నిర్జరం= మార్పు లేనివాడు;
నత= మ్రొక్కినవారిని; అధిక= పెద్ద పెద్ద;
ఆపద= ఆపదలనుండి; ఉద్దరం= బయటపడవేయువాడు
సుర+ఈశ్వరమ్= దేవతలకు అధిపతి; నిధి+ఈశ్వరమ్= నిధులకు అధిపతి; గజ+ఈశ్వరమ్= గతిస్తున్న(గ) జనిస్తున్న(జ) ఈ
సృష్టికి ప్రభువు; గణ+ఈశ్వరం=
గణములకు అధిపతి;
మహా+ఈశ్వరమ్ = గొప్ప దేవుడు; పరాత్పరామ్ = పరాత్పరుడైన; తామ్=అతనిని; ఆశ్రయం= ఆశ్రయించియుండెదను; నిరంతరం= ఎల్లప్పుడు;
సమస్తలోక
శంకరం నిరస్త దైత్యకుంజరం
దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరం
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం
సమస్తలోక= ఎల్ల లోకాలకు; శం+కరం= శుభములిచ్చువాడు; కుంజరం= ఏనుగులవంటి; దైత్య= రాక్షసులను; నిరస్త= కూల్చువాడు;
దరా= సన్నగా; ఇతర= లేని; ఉదరం=
పొట్ట కలవాడు; వరం= వరములిచ్చు
వాడు; వరేభ= శ్రేష్టమైన; వక్త్ర= ముఖము కలవాడు; అక్షరం= అక్షర స్వరూపుడు
దయ కలవాడు, క్షమా గుణం కలవాడు, ఆనందమునిచ్చు వాడు, వైభవమునిచ్చువాడు
జ్ఞానమునిచ్చువాడు, నమస్కరింప బడేవాడు, నమస్కరించెదను ఆ తేజానికి
అకించనార్తి
మార్జనం చిరంతనోక్తి భాజనం
పురారి పూర్వ నందనం సురారి గర్వచర్వణం
ప్రపంచ నాశభీషణం ధనంజయాది భూషణం
కపోలదానవారణం భజే పురాణ వారణం
అకించన= దారిద్ర్య; ఆర్తి= బాధలను; మార్జనం= తొలగించువాడు;
చిరంతన+ఉక్తి= శాశ్వతమైన వేదవాక్కుచే; భాజనం= స్తుతించబడుతున్నవాడు
పుర+అరి= త్రిపురాసురిని శత్రువైన శివుని; పూర్వ నందనం= పెద్ద
కొడుకు
సుర+అరి= దేవతల శత్రువుల; గర్వ= గర్వాన్ని; చర్వణం= మ్రింగినవాడు;
ప్రపంచ నాశ=
ప్రళయ కాలంలో; భీషణం= రుద్రుడు;
ధనంజయ= అగ్ని; ఆది= మొదలైన
వారికి; భూషణం= ఆరాధ్యుడు
కపోల= చెక్కిళ్ళపై; దాన= కారుతున్న; వారణం= మదజలము కలవాడు;
భజే= భజించెదను ; పురాణ = పురాణ కాలం నుండి;వారణం= పూజింపబడుతున్నవాడిని;
నితాంత
కాంత దంత కాంతిమ్+అంతకాంతకాత్మజం
అచింత్యరూపమ్+అంతహీనమ్+అంతరాయక్రుంతనం
హృదంతరే
నిరంతరం వసంతమేవ యోగినాం
తమేకదంతమేవ తం విచింతయామి సంతతం
నితాంత= ఎడ తెగని; కాంత= మనోహరమైన; దంత కాంతి= దంత కాంతి కలవాడు; అంతక =యముడికి; అంతక =యముడైయన శివుడి; ఆత్మజమ్= కుమారుడు;
అచింత్యరూప= ఊహకు అందని రూపము కలవాడు; అంత హీనం= నాశనము లేనివాడు; అంతరాయ= విఘ్నములను; కృంతనం= తొలగించువాడు;
యోగినాం=యోగుల; హృదంతరే= హృదయాల్లో
; నిరంతరం= ఎల్లప్పుడు; వసంతమేవ= విలసిల్లువాడు;
తమ్= అతను; ఏకదంత= ఒక్కడే
బలమైనవాడు; తం= అతన్ని; మేవ= మాత్రమే; విచింతయామి= ధ్యానించెదను; సంతతం=ఎల్ల వేళల;
ఫలశ్రుతి:
మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం
ప్రజల్పతి ప్రభాతకే హృదిస్మరన్ గణేశ్వరమ్
అరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్
ఈ మహాగణేశ పంచ రత్నాన్ని భక్తితో ఎవరు చదువుతారో,
గణేశ్వరున్ని హృదయంలో స్మరిస్తూ ఉదయం వేళ పటిస్తారో
వార్కి ఆరోగ్యం, సద్బుద్ధి, మంచి సంతానం,
ఆయురాశ్వర్యాలు వెనువెంటనే కలుగును.
ఇతి
శ్రీ శంకరాచార్య విరచితం గణేశ పంచరత్నం సంపూర్ణం.