Monday, October 4, 2021

నవరాత్రుల ప్రాముఖ్యత - నవ దుర్గా స్తోత్రం

 ధ్యానము;-

యస్యాం బింబితమ్+ఆత్మ తత్వమాగమత్ సర్వేశ్వరాఖ్యాం శుభాం

యా విష్వగ్+జగదాత్మనా పరిణతా

యా నామరూపాశ్రయా

యా మూలప్రకృతిర్గుణ త్రయవతీ

యానంత శక్తి స్స్వయం

నిత్యావృత్త నవాత్మికా జయతు సా దుర్గా నవాకారిణీ

ఎవరి యందు ప్రతిబింబించిన ఆత్మతత్వం సర్వేశ్వరుడనే శుభనామాన్ని పొందినదో,

ఎవరు తానే విశ్వముగా, జగత్తుగా పరిణామం చెందినదో,

ఎవరు ఇన్ని పేర్లతో, రూపములతో కనబడుచున్నదో,

ఎవరు ఈ మూడు గుణాలు గల మూల ప్రకృతియో,

ఎవరు స్వయంగా అనంత రూపాలైన శక్తియో,

ఎవరు నిత్యమూ మళ్ళీ మళ్ళీ ఆవృత్తమయ్యే తొమ్మిది రూపాలు కలదియో, అట్టి నవరూపాలుగా ఉన్న దుర్గాదేవి జయము కలుగు.


నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం

నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే

నవరాత్రులలో ఆరాధింపదగినది, శ్రీచక్రంలోనినవచక్రాలలో నివసించేది

శక్తి రూపిణి, అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను.


స్తోత్రము;-

 

ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |

తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ||

 

పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |

సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||

 

నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |

ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||

 

దుర్గాదేవి గురించి మార్కండేయ మహర్షి బ్రహ్మగారిని అడిగితే వచ్చిన సంభాషణ లోంచి దుర్గాదేవి వివరాలు మనకు వరాహ పురాణాం నుంచి ఈ క్రింది విధంగా తెలుస్తుంది.ఇలా దుర్గాదేవి తొమ్మిది రూపాలతో విరాజిల్లుతుందని9 నామాలను సాక్షాత్తు బ్రహ్మ దేవుడే వివరించారు.

శ్రీ గణేశ పంచరత్నం ( శంకరాచార్య విరచిత) - అర్థ సహితము - ప్రతి పదార్థము

 


ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకం
కళా ధరా అవతంసకం విలాసిలోక రక్షకం
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం

ముదా= ఆనందమును; కరాత్త= చేతిలో; మోదకం= మోదకము వలే పట్టుకున్నవాడు; సదా= ఎల్లపుడూ; విముక్తి= మోక్షమునకు; సాధకం= సాధనమైనవాడు;

కళా= చంద్రకళను; అవతంసకం= నగవలె; ధరా= ధరించనవాడు; విలాసిలోక= విలాసముగా జగములను; రక్షకం= రక్షించుచున్నవాడు;

అనాయకైక= ఏ దిక్కు లేని వారికి; నాయకం= దిక్కైనవాడు; 

వినాశితేభ=  వినాశనమైనవాడు ; దైత్యకం= రాక్షసులకు;

నత= నమస్కరించిన వారి;  అశుభ= ఆపదలను; ఆశు= క్షణాల్లో;  నాశకం= కూలద్రోయువాడు; నమామి= నమస్కరించెదను; తం= అటువంటి  వినాయకం= ఏ నాయకుడు లేనివాడికి;


నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం
నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరం
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం

నత + ఇతరాతి= నమస్కరించని  వారికి; భీకరం=  భయంకరుడు;

నవ= క్రొత్తగా; ఉదితా= ఉదయించే; అర్క= సూర్య; భాస్వరం= కాంతి వలే ఎర్రని తేజస్సు కలవాడు

సుర+అరి= దేవతలు, రాక్షసులచే; నమః=  నమస్కరింపబడే వాడునిర్జరం= మార్పు లేనివాడు;

నత= మ్రొక్కినవారిని; అధిక= పెద్ద పెద్ద; ఆపద= ఆపదలనుండి; ఉద్దరం=  బయటపడవేయువాడు

సుర+ఈశ్వరమ్= దేవతలకు అధిపతి; నిధి+ఈశ్వరమ్= నిధులకు అధిపతి; గజ+ఈశ్వరమ్= గతిస్తున్న(గ) జనిస్తున్న(జ) ఈ సృష్టికి   ప్రభువు; గణ+ఈశ్వరం= గణములకు అధిపతి;

మహా+ఈశ్వరమ్ = గొప్ప దేవుడు; పరాత్పరామ్ = పరాత్పరుడైన; తామ్=అతనిని; ఆశ్రయం= ఆశ్రయించియుండెదను; నిరంతరం= ఎల్లప్పుడు;


సమస్తలోక శంకరం నిరస్త దైత్యకుంజరం
దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరం
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం

సమస్తలోక= ఎల్ల లోకాలకు; శం+కరం= శుభములిచ్చువాడు; కుంజరం= ఏనుగులవంటి; దైత్య= రాక్షసులను; నిరస్త= కూల్చువాడు;

దరా= సన్నగా; ఇతర= లేని; ఉదరం= పొట్ట కలవాడు; వరం= వరములిచ్చు వాడు; వరేభ= శ్రేష్టమైన; వక్త్ర= ముఖము కలవాడు; అక్షరం= అక్షర స్వరూపుడు

దయ కలవాడు, క్షమా గుణం కలవాడు, ఆనందమునిచ్చు వాడు, వైభవమునిచ్చువాడు

జ్ఞానమునిచ్చువాడు, నమస్కరింప బడేవాడు, నమస్కరించెదను ఆ తేజానికి


అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం
పురారి పూర్వ నందనం సురారి గర్వచర్వణం
ప్రపంచ నాశభీషణం ధనంజయాది భూషణం
కపోలదానవారణం భజే పురాణ వారణం 

 అకించన= దారిద్ర్య; ఆర్తి= బాధలను; మార్జనం=  తొలగించువాడు;

చిరంతన+ఉక్తి= శాశ్వతమైన వేదవాక్కుచే; భాజనం= స్తుతించబడుతున్నవాడు

పుర+అరి= త్రిపురాసురిని శత్రువైన శివుని; పూర్వ  నందనం= పెద్ద కొడుకు

సుర+అరి= దేవతల శత్రువుల; గర్వ= గర్వాన్ని; చర్వణం= మ్రింగినవాడు;

ప్రపంచ నాశ=  ప్రళయ కాలంలో;  భీషణం=  రుద్రుడు

ధనంజయ= అగ్ని; ఆది= మొదలైన వారికి; భూషణం=  ఆరాధ్యుడు

కపోల= చెక్కిళ్ళపై; దాన= కారుతున్న; వారణం= మదజలము కలవాడు;

భజే= భజించెదను ; పురాణ = పురాణ కాలం నుండి;వారణం= పూజింపబడుతున్నవాడిని;


నితాంత కాంత దంత కాంతిమ్+అంతకాంతకాత్మజం
అచింత్యరూపమ్+అంతహీనమ్+అంతరాయక్రుంతనం

హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం
తమేకదంతమేవ తం విచింతయామి సంతతం 

నితాంత= ఎడ తెగని; కాంత= మనోహరమైన; దంత కాంతి= దంత కాంతి కలవాడు;  అంతక =యముడికి; అంతక =యముడైయన శివుడిఆత్మజమ్= కుమారుడు;

అచింత్యరూప= ఊహకు అందని రూపము కలవాడు; అంత హీనం= నాశనము లేనివాడు; అంతరాయ= విఘ్నములను; కృంతనం= తొలగించువాడు;

యోగినాం=యోగుల;  హృదంతరే= హృదయాల్లో ; నిరంతరం= ఎల్లప్పుడు; వసంతమేవ= విలసిల్లువాడు;

తమ్= అతను; ఏకదంత= ఒక్కడే  బలమైనవాడు; తం= అతన్ని;  మేవ= మాత్రమే; విచింతయామి= ధ్యానించెదను; సంతతం=ఎల్ల వేళల;


ఫలశ్రుతి:

మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం
ప్రజల్పతి ప్రభాతకే హృదిస్మరన్ గణేశ్వరమ్
అరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్

ఈ మహాగణేశ పంచ రత్నాన్ని భక్తితో ఎవరు చదువుతారో,

గణేశ్వరున్ని హృదయంలో స్మరిస్తూ ఉదయం వేళ పటిస్తారో

వార్కి ఆరోగ్యం, సద్బుద్ధి, మంచి సంతానం,

ఆయురాశ్వర్యాలు వెనువెంటనే కలుగును.

ఇతి శ్రీ శంకరాచార్య విరచితం గణేశ పంచరత్నం సంపూర్ణం. 

నవరాత్రుల ప్రాముఖ్యత - నవ దుర్గా స్తోత్రం

  ధ్యానము ;- యస్యాం బింబితమ్+ఆత్మ తత్వమాగమత్ సర్వేశ్వరాఖ్యాం శుభాం యా విష్వగ్+జగదాత్మనా పరిణతా యా నామరూపాశ్రయా యా మూలప్రకృతిర్గుణ త్...